సాధారణంగా మనం పెళ్లికి వెళ్ళినప్పుడు విలువైన వస్తువులను కానుకలుగా ఇస్తాం. ఈ మధ్య కొన్ని వైవిద్యమైన గిఫ్ట్‌లు ఇస్తూ వస్తున్నారు యూత్. కూలర్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు… ఇలా కొత్త తరహాలో బహుమతిగా ఇస్తూనే ఉన్నారు. అయితే తన స్నేహితుడి పెళ్ళికి వినూత్నగా అలోచించి గిఫ్ట్ ఇచ్చాడు ఆ స్నేహితుడు. అది ఓపెన్ చేసిన స్నేహితుడు నిర్గాంతపోయాడు. ఆతర్వాత పొట్టచెక్కలయ్యేలా నవ్వడం మొదలుపెట్టారు.
తమిళనాడు రాష్ట్రం కడలూరులో జరిగిన తన స్నేహితుడి పెళ్లికి హాజరైన మిత్రులు నూతన వధూవరుల చేతికి అందిస్తున్న పెట్రోలు క్యాన్‌ను చూసి పెళ్లిపందిట్లో ఉన్న వారంతా నివ్వెరపోయి, ఆ తర్వాత పొట్టచెక్కలయ్యేలా నవ్వడం మొదలుపెట్టారు. రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్న పెట్రోలు ధర మూలంగా ఇదే ఇప్పుడు విలువైన వస్తువుని భావించి వరుడికి గిఫ్ట్ గా ఇచ్చినట్లు వరుడి మిత్ర బృందం చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఆ నూతన వధూవరుల ఫేమస్ అయిపోయారు. మరీ మీరు ఓ లుక్ వెయ్యండి.
Tamil Nadu couple gets petrol as wedding present. #ITVideo
More videos: https://t.co/NounxnP7mg pic.twitter.com/NfRmMRsJYK— India Today (@IndiaToday) September 17, 2018