మ‌ర్క‌జ్ ప్రార్థనల వల్ల 617 మందికి కరోనా లక్షణాలు..


ఢిల్లీ నిజాముద్దీన్ ఈ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. మార్చి మొదటోయ్ రెండు వారాల్లో జరిగిన ప్రార్థనలకు విదేశాల నుండి మత పెద్దలు హాజరయ్యారు. వారి కారణంగా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ పెరిగిపోయింది. ఈ ప్రార్థనలకు వెళ్లిన చాలామందికి కరోనా సోకింది. తెలుగు రాష్ట్రాల నుండి ఇష్టం వందల సంఖ్యలో ఇక్కడి వెళ్లారు.

మార్చి 23వ తేదీన ఢిల్లీ పోలీసులు మ‌ర్క‌జ్ నిర్వ‌హించిన అక్క‌డ సీనియ‌ర్ స‌భ్యుల‌కు వార్నింగ్ ఇచ్చారు. దేశంలో లాక్‌డౌన్ విధించార‌ని, బిల్డింగ్‌ను వెంట‌నే ఖాళీ చేయాల‌ని పోలీసులు వారిని కోరారు. లాక్‌డౌన్ రూల్స్‌ను క‌చ్చితంగా పాటించాల‌ని హెచ్చ‌రించారు.

ఈ స‌మావేశాల‌కు వ‌చ్చిన 157 మంది విదేశీయుల‌ను కూడా క్వారెంటైన్‌కు వెళ్లాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. వేరువేరు మ‌సీదుల్లో ఉన్న‌వారు స్వ‌చ్ఛందంగా రావాల‌న్నారు. మ‌ర్క‌జ్ పెద్ద‌ల‌కు వార్నింగ్ ఇస్తున్న వీడియోను పోలీసులు విడుద‌ల చేశారు. మర్కజ్‌ భవనంలో ఉన్న 2,361 మందిని బయటకు తీసుకువచ్చామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిపోడియా తెలిపారు. వీరిలో 617 మందికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్లు డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.