దిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతాన్ని పోలీసులు శానిటైజ్ చేశారు. గత నెలలో జరిగిన తబ్లిగీ జమాత్‌లో పాల్గొన్న అధికశాతం మందిలో కరోనా లక్షణాలు బయటపడుతుండటంతో ఆ ప్రాంతాన్ని కొవిడ్ 19 హాట్ స్పాట్‌గా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మర్కజ్ ప్రాంతాన్ని పోలీసులు శానిటైజ్ చేశారు.
ఇదీలావుంటే దేశవ్యాప్తంగా కరోనా కేసులకు 10 ప్రాంతాలు హాట్‌స్పాట్లుగా ఉన్నాయని ప్రకటించిన కేంద్రం.. తాజాగా కొవిడ్ 19 హాట్‌స్పాట్‌లలో రాపిడ్ యాంటీ బాడీ టెస్ట్‌లు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఐసీఎంఆర్ ఆదేశాలు జారీచేసింది. హాట్ స్పాట్ లుగా పరిగణించిన ప్రాంతాల్లో జనాభా ఎక్కువ ఉన్న చోట ఈ పరీక్షలు నిర్వహించాలని సూచించింది.