రచయిత్రి మాలతీ చందూర్ ఇక లేరు

malathi chandurప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్ మాలతీ చందర్ (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా మాలతీ చందూర్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆమె మృతి చెందారు. తొలి మహిళ కాలమిస్టుగా గుర్తింపు సాధంచిన మాలతీ చందూర్ 1930వ సంవత్సరంలో కృష్ణా జిల్లాలోని నూజివీడులో జన్మించారు. ఆమె ఎన్నో పుస్తకాలతో పాటు వివిధ పత్రికల్లో వ్యాసాలు రాశారు. స్వస్థలం ఏలూరు అయినా, వివాహానంతరం చెన్నయ్ లో స్థిరపడ్డారు. 1970 నుంచి కొంతకాలంపాటు జాతీయ సెన్సార్ బోర్డు సభ్యరాలిగా వ్యవహరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు.