24 సంవత్సరాల క్రితం చనిపోయాడనుకున్న వ్యక్తి ఇప్పుడు తిరిగొచ్చాడు, ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని అల్మోరా జిల్లాలో ఉన్న రాణిఖేత్ ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, మధో సింగ్ మెహ్రా అనే వ్యక్తి 24 సంవత్సరాల క్రితం కుటుంబ కలహాల కారణంగా ఇంట్లోనుండి ఎక్కడికో వెళ్ళిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసారు. ఎన్ని సంవత్సరాలు గడిచిన అతను ఇంటికి రాకపోవడంతో చనిపోయాడనుకొని కుటుంబ సభ్యులు అతనికి కర్మ కండలు నిర్వహిస్తున్నారు.
ఇటీవలే గ్రామ సమీపంలోని పొలాల్లో ఆ వ్యక్తి తిరుగుతుండగా గ్రామ వాసులు గుర్తించి ఇంటికి తీసుకెళ్లారు. అయితే అతనికి కర్మ కాండలు నిర్వహిస్తుండడంతో ఆ దోష నివారణ కోసం నామకరణం చేయాల్సిందిగా పండితులు సూచించారు. దీంతో అతనిని ఇంటి బయటే ఉంచారు, నామకరణం చేసిన తరువాతే ఇంట్లోకి తీసుకెళ్లనున్నారు కుటుంబ సభ్యులు.
అతను ఇంట్లోనుండి వెళ్లిపోయిన సమయంలో అతనికి భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు, ఇప్పుడు అతనికి 72 సంవత్సరాలు. అతని భార్య అప్పటినుండి విడవరాలిగానే జీవనం సాగిస్తూ ఇద్దరు పిల్లలు పెంచింది. పిల్లలు పెళ్లిళ్లు చేసుకొని స్థిరపడ్డారు. అయితే ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళావు అని అడుగగా ఏమి గుర్తులేదని చెబుతున్నాడు.