ప్రియుడిపై ఇలా కూడా పగ తీర్చుకుంటారా..?

సాధారణంగా లవర్స్ మధ్య గొడవలు వస్తుంటాయి..పోతుంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఓ లవర్ తన ప్రియుడి ఫై వచ్చిన కోపం తో అతడిపై పగ తీర్చుకోవాలని అనుకుంది. అది కూడా మాములుగా కాదు పదిమంది ముందు అతడి పరువు పోవాలి అని అనుకుంది. అనుకోవడమే ఆలస్యం ఓ మాస్టర్ ప్లాన్ చేసింది.

ఓ డెలివరీ బాయ్‌ కి డబ్బులు ఇస్తానని చెప్పి నేను చెప్పినట్లు చేయమని కోరింది. దానికి సదరు డెలివరీ బాయ్‌ ఓకే చెప్పాడు. ఆమె అప్పుడు ఏం చేసిందంటే..ఓ టీ షాపులో వేడి వేడి టీ ఆర్డర్ ఇచ్చింది. దాన్ని తన బాయ్‌ఫ్రెండ్ వద్దకు తీసుకెళ్లి మొహాన కొట్టాలని డెలివరీ బాయ్‌కి చెప్పింది. అలా చేస్తే డబ్బులిస్తానని చెప్పడం తో సదరు డెలివరీ బాయ్.. టీ తీసుకెళ్లి రోడ్డుపై నిలబడి ఉన్న ఆమె బాయ్‌ఫ్రెండ్ వద్దకు వెళ్లి..తన చేతిలో ఉన్నకప్పులోని టీ ని ఆ యువకుడి మొహాన కొట్టాడు. ఆ తర్వాత రిసీట్‌లో కస్టమర్ రిక్వెస్ట్ చూపించాడు. ఈ మొత్తాన్ని కొందరు కెమెరాలో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది ఇప్పుడు వైరల్ గా మారింది.