Site icon TeluguMirchi.com

లాక్‌డౌన్‌ పై కేటీఆర్ వార్నింగ్

లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రులు కేటీఆర్‌.. అధికారులకు మార్గనిర్దేశం చేశారు.

కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో వంద శాతం లాక్‌డౌన్‌ అమలయ్యేలా చూడాలని.. ఆ ప్రాంతాల్లో ఇళ్లకే నిత్యావసరాలు అందించాలని కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో రోజుకు రెండు సార్లు ప్రతిఒక్కరి ఆరోగ్య వివరాలను సేకరించాలని చెప్పారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి ఎక్కువగా కేసులు నిర్ధారణ అవుతున్న జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రత్యేకంగా దృష్టిసారించాలని హెచ్చరించిన తెలిసిందే. ప్రస్తుతం నగరంలోని 17 సర్కిళ్లను 17 జోన్లుగా విభజించి ప్రత్యేక అధికారులను నియమించాలని తద్వారా పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు.

Exit mobile version