లాక్ డౌన్ ..దారితప్పింది

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో దీనిని ఆదిలోనే అరికట్టాలని కేంద్ర సర్కార్ లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 వరకు మోడీ లాక్ డౌన్ ప్రకటించడం తో మొదటి రెండు , మూడు రోజులు అన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ ఎఫెక్ట్ బాగా కనిపించింది కానీ నిన్నటి నుండి చాల చోట్ల లాక్ డౌన్ కనిపించడం లేదు. ఎక్కడ చుసిన జనాలు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు.

ఈ రోజు ఆదివారం ఎక్కువ మంది నాన్ వెజ్ తింటారు కాబట్టి… ప్రజలు పెద్ద సంఖ్యలో మాంసం షాపులకు గుంపులుగా వచ్చారు. వారిని కట్టడి చేయడం షాపుల నిర్వాహకుల వల్ల కాలేదు. అదే సమయంలో… జనం సోషల్ డిస్టాన్స్ పాటించడం మానేసి… మాకు త్వరగా కావాలంటే, మాకు త్వరగా కావాలంటూ… ఎగబడుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ప్రభుత్వాలే చికెన్ తింటే మంచిదని చెప్పడం, రెండు వారాల తర్వాత చికెన్ షాపులు తెరచుకోవడంతో… ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు.

ఇక నాలుగో అంశంగా ప్రభుత్వాలు ఇస్తున్న రేషన్ సరుకులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు ముందుగానే రేషన్ సరుకులు ఇస్తుండటంతో… తర్వాత తమకు దక్కుతాయో లేదో అన్న టెన్షన్‌తో ప్రజలు… ఒక్కసారిగా రేషన్ సరుకుల కోసం వెళ్తున్నారు. ఫలితంగా అక్కడ కూడా సామాజిక దూరం మిస్సైంది.

ఈ పరిస్థితి కరోనా వైరస్ వ్యాప్తిని కచ్చితంగా పెంచుతుందని అంటున్నారు డాక్టర్లు. నెక్ట్స్ రెండు వారాల తర్వాత దీని ప్రభావం కనిపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.