కరోనా వైరస్ అరికట్టేందుకు కేంద్రం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో ఎక్కడి జనాలు అక్కడే ఉండిపోయారు. ముఖ్యముగా బ్రతుకుతెరువు కోసం వచ్చిన ప్రజల కష్టాలు మాటల్లో చెప్పలేం. పనులు లేక తిండిలేక , ఉండలేక వారంతా నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో వలసలకు వచ్చిన కూలీలు ఇప్పుడు సొంత ఊళ్లకు వెళ్లాలనుకుంటున్నారు.
ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఇంటికి చేరుకోవడానికి 200 కిలోమీటర్ల దూరం నడిచిన 38 ఏళ్ల వ్యక్తి శనివారం(28 మార్చి 2020) ఢిల్లీ-ఆగ్రా రహదారిపై చనిపోయాడు. రణ్‌వీర్ సింగ్ అనే యువకుడు మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలోని మారుమూల గ్రామంలో ఉన్న అతను తన ఇంటికి ఇంకా 100 కిలోమీటర్ల దూరం ఉండగా గుండెపోటుతో చనిపోయాడు. అలాగే మరికొంతమంది సైతం రోడ్డున మార్గాన నడుకుంటూ వెళ్తూ ప్రాణాలు విడిచారు. కరోనా ఏమోగానీ లాక్ డౌన్ కారణంగా ప్రాణాలు పోతున్నాయని జనాలు గుగ్గులు పెడుతున్నారు.