సహజీవనం చేసి రేప్‌ అంటే ఒప్పుకోం : సుప్రీం

మహిళలపై అఘాయిత్యాలను ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే. మహిళలను లైంగికంగా వేదించే వారిని కూడా కఠినంగా శిక్షించాలి. రేప్‌కు పాల్పడ్డ వారిని వెంటనే ఉరి తీయాలంటూ అంతా డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ సమయంలోనే కొందరు ఆడవారు కక్షపూరితంగా మగవారిపై రేప్‌ కేసులు పెట్టడం చర్చనీయాంశం అవుతుంది. కొన్నాళ్లు సహజీవనం చేసి ఆ తర్వాత వచ్చి అతడు నన్ను రేప్‌ చేశాడు అంటూ కేసులు పెట్టడం, కోర్టులకు ఎక్కడం జరుగుతుంది.

తాజాగా ఇలాంటి కేసులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పరస్పర అంగీకారంతో సహజీవనం సాగించి, కొన్నాళ్ల తర్వాత రేప్‌ అంటూ రావడంను కోర్టు తప్పుబట్టింది. తాజాగా ఒక మహిళ తాను ఒక వ్యక్తితో ఆరు సంవత్సరాల పాటు సహజీవనం సాగించాను అని, ఆయన నన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ చెబుతూ వచ్చాడు. అయితే తీరా ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటూ దూరం పెట్టాడు. అందుకే ఆయనపై రేప్‌ కేసు పెట్టాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆమె ఫిర్యాదుపై విచారణ జరిపిన కోర్టు పరస్పర అంగీకారంతో జరిగింది కనుక అది రేప్‌ అవ్వదు అని తేల్చి చెప్పింది.