Site icon TeluguMirchi.com

రైతుబంధులో కోత.. మంచి నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన రైతు బంధు పథకం లక్ష్యం తప్పుదారి పట్టింది అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. పదుల ఎకరాలు, వందల ఎకరాలు ఉన్న వారికి రైతు బంధు రావడం వల్ల అందరి కంటే ఎక్కువగా వారే లబ్ది చెందుతున్నారు అంటూ అంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరం ఉన్న వారికి ఎక్కువ సాయం చేస్తే బాగుంటుంది. కాని పదుల ఎకరాలు ఉన్న వారికి సాయం చేయాల్సిన అవసరం ఏంటీ అంటూ కొందరు ప్రశ్నించారు.

భారీ బడ్జెట్‌ ఖర్చు అవుతున్న కారణంగా రైతు బంధు పథకంలో కోత విధించినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై రైతు బంధు కేవలం 10 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంకు ఏడాదికి దాదాపుగా 12 వందల కోట్ల వరకు మిగులుతుందని ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. రైతుల కష్టం తెలిసిన ప్రభుత్వం కనుక 10 ఎకరాలు ఉన్న వారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే రైతు బందు ఉండదు అంటూ నిర్ణయానికి రావడంపై హర్షం వ్యక్తం అవుతోంది. అక్రమార్కులకు రైతు బంధు వెళ్లదని అంటున్నారు.

Exit mobile version