40 ఏళ్ల రాకెట్

spo140 ఏళ్ల వయసులో ఆరడుగుల బుల్లెట్లా, పదునైన షాట్లతో రాకెట్లా మన లియాండర్ మళ్లీ మెరిశాడు. దీంతో భారత్ డబుల్స్ స్టార్ ఖాతాలో మరో గ్రాండ్ స్లామ్ టైటిల్ వచ్చి చేరింది. యూఎస్ ఓపెన్‌లో లియాండర్ తన భాగస్వామి రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్)తో కలిసి పేస్ పురుషుల డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. ఆదివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో పేస్-స్టెపానెక్ జోడి 6-1, 6-3తో రెండో సీడ్ పెయా (ఆస్ట్రియా)-సోరెస్ (బ్రెజిల్) ద్వయంపై గెలిచింది. ఈ ఇండో-చెక్ రిపబ్లిక్ జోడి కేవలం గంటా 12 నిమిషాల్లోనే ప్రత్యర్థి జంటకు చెక్ పెట్టింది.గతేడాది రన్నరప్‌తో సరిపెట్టుకున్న భారత ఆటగాడు ఈ సారి విజేతగా నిలిచాడు.

ఈ సంధర్భంగా పేస్ మాట్లాడుతూ… ‘చాల సంతోషంగా వుంది. డబుల్స్ భాగస్వాముల కోసం అన్వేషించే వారికి చెక్ రిపబ్లిక్ ఆటగాళ్లను ఎంచుకోమని చెబుతా. వాళ్ళు చాలా కష్ట పడతారు. స్టెపానెక్ కృతజ్ఞతలు’. లియాండర్ గ్రాండ్ స్లామ్స్ లో మొత్తం 16 సార్లు డబుల్స్ ఫైనల్ చేరుకోగా.. ఎనిమిది సార్లు విజయం సాదించాడు.

peas