Site icon TeluguMirchi.com

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..షాక్ లో కుటుంబ సభ్యులు

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం కుటుంబ సభ్యులను విషాదంలో పడేసింది. పుణేలో శ్రద్ధా శివాజీ జయభే (28) అనే మహిళ కానిస్టేబుల్‌ గా విధులు నిర్వహిస్తూ ఉంటోంది. శ్రద్ధా తల్లిదండ్రులు, ఆమె మామ అహ్మద్‌ నగర్‌ లో ఉంటుండగా..శ్రద్ద తమ పాపను బంధువుల ఇంట్లో ఉంచి రోజూ విధులకు వెళ్లేది. ఆలా రాత్రి కూడా బంధువుల ఇంట్లో కూతురిని వదిలి డ్యూటీకి వెళ్లిన శ్రద్ధా.. తిరిగి బంధువుల ఇంటికి రాలేదు.

ఆమె ఇంట్లోనే ఉరేసుకుని కనిపించింది. పాపను తీసుకెళ్లేందుకు ఉదయాన్నే శ్రద్ధా రాకపోవడంతో.. బంధువులు ఇంటికి వెళ్లి చూడగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది.ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు లోనైన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. ఈమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు..

Exit mobile version