Site icon TeluguMirchi.com

విద్యార్థులకు కేటీఆర్ ఏ సలహా ఇచ్చాడో తెలుసా..?

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితం అయ్యారు. విద్యాసంస్థలు అన్ని మూతపడడం తో చాలామంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ విద్యార్థులకు ఓ సలహా ఇచ్చారు.

లాక్ డౌన్ సమయాన్ని పిల్లలు, కళాశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తల్లితండ్రులకు ఈ మేరకు ఆయన సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ టి-సాట్ ఛానెళ్ల ద్వారా ఇంటివద్దనే గణితం, స్పోకెన్ ఇంగ్లీష్, మరెన్నో నేర్చుకోవచ్చన్నారు. పోటీ పరీక్షలకు విద్యార్థులంతా సిద్ధం కావచ్చని ట్వీట్ ద్వారా కేటీఆర్ సలహా ఇచ్చారు. కేటీఆర్ ట్వీట్‌పై నెటిజన్స్ అంతా స్పందిస్తున్నారు. మంచి సలహా, గ్రేట్ ఐడియా అంటూ బదులు ఇస్తున్నారు.

Exit mobile version