కార్తీక మాసంలో అందరికీ గుర్తుకు వచ్చేది కోటిదీపోత్సవం.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఎన్టీవీ-భక్తి టీవీ నిర్వహించే ‘కోటి దీపోత్సవం’భక్తులు, ప్రేక్షకుల మదిలో అజరామరమైన స్థానాన్ని సంపాదించుకుంది.. కార్తీక మాసంలో వెలిగే ప్రతి ప్రమిద మంగళప్రదం అంటారు.. అదే కోటిదీపోత్సవం వేదికగా వెలిగిస్తే.. మరెంతో పుణ్యమని నమ్ముతున్నారు భక్తులు.. హైదరాబాద్‌కే పరిమితం కాకుండా.. తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ దీపోత్సవానికి తరలివస్తారంటే.. కోటిదీపోత్సవానికి ఉన్న ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు.. ఈ మహా దీపయజ్ఞం పదేళ్లు పూర్తి చేసుకుంటుంది… 2012లో రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత నరేంద్ర చౌదరి, రమాదేవి పుణ్య దంపతుల సంకల్పంతో ఈ దీపోత్సవానికి అంకురార్పణ జరిగింది.. తొలిసారిగా లక్ష దీపాలతో ప్రారంభమైన ఈ మహాదీపయజ్జం.. మరుసటి ఏడాది నుంచే కోటిదీపోత్సవంగా మారింది.. క్రమంగా ఆధ్యాత్మిక జగత్తులో మహోద్యమంగా కొనసాగుతోంది. ఈ ఏడాది.. ఈ నెల 31వ తేదీ నుంచి మళ్లీ ప్రారంభం కాబోతోంది.
ఆ కైలాసమే ఇలకి దిగివచ్చిందా అనేలా.. కోటిదీపోత్సవ వేదిక ముస్తాబవుతోంది.. ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీతో ఆరంభమై.. నవంబర్ 14వ తేదీ వరకు కొనసాగనుంది కోటిదీపోత్సవం. ఓవైపు ఎన్టీవీ నంబర్ వన్ తెలుగు న్యూస్ చానెల్‌గా కొనసాగుతుండడం.. భక్తి టీవీ.. ఆధ్యాత్మిక జగత్తులో ప్రత్యేకంగా నిలవడం.. దీపాల ఉత్సవానికి అంకురార్పణ జరిగి పదేళ్లు అవుతుతోన్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సారి మరింత వైభవంగా కోటిదీపోత్సవం జరగనుంది.. ఈ నెల 31వ తేదీ నుంచి ప్రతిరోజూ పసాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో ఈ ఉత్సవం 15 రోజుల పాటు కొనసాగనుంది.. కోటి దీపోత్సవం అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు.. పాల్గొనే ప్రతీ భక్తుడికి ఎన్నో అద్భుత అధ్యాత్మిక జ్ఞాపకాలను పదిలపర్చుకునే మహాపర్వం.. శంఖారావాలు, డమరుక ధ్వనులు, వేదమంత్రాలఘోషలు, ప్రదోషకాల అభిషేకాలు.. బిల్వార్చనలు, విశేష పూజలు, కల్యాణోత్సవాలు, వాహనసేవలు, హారతులు, దీపాల వెలుగులు ఇవన్నీ ఒకేచోట.. అది కూడా ఎలాంటి రుసుములు లేకుండా.. హుండీల్లో సమర్పించుకోవాల్సిన అవసరం లేకుండా.. కోటి దీపాలు స్వయంగా వెలిగించుకునే ఏకైక పుణ్యప్రదమైన ఉత్సవం.. ఈ మహాద్భుత అధ్యాత్మిక ఉత్సవంలో పాల్గొని మహాదేవుని అనుగ్రహానికి పాత్రులు కావాలంటూ ఎన్టీవీ-భక్తి టీవీ భక్తులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది..