దక్షిణ కొరియాలో తిరగబెట్టిన కరోనా


దక్షిణ కొరియాలో కొవిడ్‌-19 నయమైందని భావించిన 91 మందికి పరీక్షల్లో మళ్లీ పాజిటివ్‌ రావడం కలకలం సృష్టిస్తోంది. కరోనా నయమైన వారికి వైరస్‌ ఇతరుల నుంచి సోకుండా శరీరంలోనే తిరిగి చైతన్యమైందేమోనని భావిస్తున్నామని కొరియా వ్యాధుల నియంత్రణ సంస్థ డైరెక్టర్‌ జియాంగ్‌ ఇయున్‌ క్యెయాంగ్‌ అంటున్నారు.

ఇలా ఎందుకు జరుగుతోందో అర్థంకావడం లేదన్నారు. వైద్యులు, శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారని వివరించారు. ఒక్కసారి కొవిడ్‌ సోకినవారిలో యాంటీబాడీలు పెరిగి సంబంధిత రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఇంతకాలం భావించారు. వైరస్‌ మళ్లీ దాడిచేస్తుండటంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది.