Site icon TeluguMirchi.com

ఈ ఏడాది ఖైరతాబాద్‌ మహాగణపతి ఎలా ఉంటాడో తెలుసా..?

గణేష్ నవరాత్రులు వస్తున్నాయంటే దేశ వ్యాప్తంగా అందరి చూపు హైదరాబాద్ ఖైరతాబాద్‌ మహాగణపతి పైనే ఉంటుంది..ఈ ఏడాది ఎత్త ఎత్తుగా ఉంటాడో..ఎలా కనిపిస్తాడో అంటూ అందరు మాట్లాడుకుంటారు..ఇక ఈ ఏడాది ఖైరతాబాద్‌ గణేశుడు శ్రీ చండీకుమార మహాగణపతిగా దర్శనమివ్వనున్నారు. ఈసారి 57 అడుగులతో గణనాధుడు దర్శనం ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబదించిన పోస్టర్ ను గణేశ్‌ ఉత్సవ కమిటీ శనివారం సాయంత్రం విడుదల చేసింది.

గతేడాది 58 అడుగుల విగ్రహం దర్శనమివ్వగా.. ఈ ఏడాది ఓ అడుగు తగ్గించనున్నట్టు ఉత్సవ కమిటీ తెలిపింది..ప్రతి ఏటా ఏదో ఒక ఒక ప్రత్యేకతతో ఖైరతాబాద్‌ గణేశుడి ఉత్సవ కమిటీ విగ్రహాన్ని తయారు చేస్తుంటుంది. ఈ ఏడాది చండీకుమార మహాగణపతిగా భక్తులకు కనిపించబోతున్నాడు.

Exit mobile version