Site icon TeluguMirchi.com

కేరళ వరద బాధితులకు రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం

వరదలతో సర్వం కోల్పోయి కన్నీళ్లు పెడుతున్న కేరళకు రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలిచింది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 21 కోట్ల విరాళం అందజేసింది. దాంతో పాటు రూ. 50 కోట్ల విలువైన వస్తువులను వరద బాధితులకు పంపిణీ చేయనుంది.

వీటితో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లో భాగమైన రిలయన్స్ రిటైల్, జియో సహకారంతో వరద బాధితులకు అన్ని విధాలుగా ఆపన్న హస్తం అందిస్తూ, సహకార చర్యల్లో తమ వంతు సహకారం చేస్తోంది.

వరద బాధిత ప్రాంతాల్లో ఇప్పటికే రిలయన్స్ ఫౌండేషన్ సహాయక చర్యల్లో పాల్గొంది. ఆగస్ట్ 14 నుంచి వయనాడ్, త్రిస్సుర్, అలప్పుళ, ఎర్నాకుళం సహా పలు జిల్లాల్లో వలంటీర్లు పనిచేస్తున్నారు.

రిలయన్స్ రిటైల్ తరుపున 160 ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహారపదార్థాలు, గ్లూకోజ్, శానిటరీ నాప్కిన్స్ ని పంపిణీ చేస్తోంది. అలాగే, కేరళలో వారం రోజుల పాటు ఉచిత వాయిస్, డేటా సేవలను అందించనున్నట్లు జియో ప్రకటించింది.

Exit mobile version