సానియాకు కేసీఆర్ బంపర్ ఆఫర్!

KCR-offer-to-sania
భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జాకు ముఖ్యమంత్రి కేసీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఏకంగా కోటీ  రూపాయల నజరానాను ప్రకటించారు. యూఎస్ ఓపెన్ టోర్నీలో పాల్గొనేందుకు శిక్షణ కోసం ఈ మొత్తాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. సానియా కేసీఆర్ ను కలవడం ఇదే ప్రథమం. మర్యాద పూర్వకంగా కలసిన సానియాకు కేసీఆర్ కోటీ రూపాయల బంపర్ ఆఫర్ ప్రకటించడం విశేషం. భేటీ అనంతరం సానియా విలేకర్లతో మాట్లాడుతూ.. కేసీఆర్ ను మర్యాదపూర్వకంగానే కలసినట్లు చెప్పారు. రేపు మరోసారి కేసీఆర్ కలమని చెప్పినట్లు ఆమె తెలిపారు. కాగా, ఎంతో మంది యువ క్రీడాకారులు ఆర్థిక సహాయం కోసం వేచి చూస్తున్న సమయంలో.. ఇప్పటికే స్టార్ గా ఎదిగి ఎన్నో కోట్లు రూపాయలను గడించిన సానియాకు కేసీఆర్ కోటీ ఆఫర్ ఇవ్వడం ఆశ్చర్యపరిచే విషయమే.