కాశ్మీర్ ఫై సంచలన తీర్పు ప్రకటించిన కేంద్రం..

రాజ్యసభలో కాశ్మీర్ అంశం ఫై సంచలన తీర్పు ప్రకటిచారు అమిత్ షా. రాజ్యాంగంలోని 370వ అధికరణ రద్దు ప్రతిపాదన చేశారు.

ఉదయం 11 గంటలకు మొదలైన రాజ్యసభ సెషన్‌లో ఆయన జమ్ముకశ్మీర్‌ రిజర్వేషన్ల సవరణ బిల్లుతోపాటు ఆర్టికల్‌ 370 రద్దు చేస్తామని ప్రకటించారు. దీంతో ప్రతిపక్షాలు ఒక్కసారిగా ఆందోళనకు దిగాయి. గందరగోళం మధ్య కొద్దిసేపు రాజ్యసభ టీవీ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు. రాష్ట్రపతి గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారానే ఈ బిల్లు రద్దు జరుగుతుందని పేర్కొన్నారు. దీంతోపాటు కశ్మీర్‌లో నియోజకవర్గ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు కూడా రాజ్యసభ ముందుకు వచ్చింది.

గత వారం రోజులుగా భద్రతా బలగాల మోహరింపుతో కల్లోలంగా మారిన కశ్మీర్‌ వ్యవహారం కీలక ప్రకటనతో ముగిసింది. అమిత్‌ షా ప్రకటనపై రాజ్యసభలో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. బీజేపీ ప్రభుత్వం రాజ్యంగాన్ని ఉల్లంఘించి ఈ నిర్ణయం తీసుకుందని తీవ్రంగా మండిపడ్డాయి.

కాగా అమిత్‌ షా ప్రకటనకు ముందు ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర మంత్రిమండలి భేటీ అయిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా దేశానికి సమస్యగా మారిన కశ్మీర్‌ ప్రత్యేక హక్కుల అధికరణను తొలగించాలని కేబినెట్‌ నిర్ణయించింది. దీని కోసం ఎన్నో రోజులగా తీవ్ర కసరత్తు చేసిన మోదీ ప్రభుత్వం.. కీలక సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటించింది.