ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కర్నూలు జిల్లాలో తాజాగా మరో ఐదు కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ వెల్లడించారు. కొత్తగా నమోదైన కేసులతో ఇప్పటి వరకు జిల్లాలో కొవిడ్ బాధితుల సంఖ్య 98కి చేరినట్లు చెప్పారు.
కాగ ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల అంతకంతకూ పెరుగుతూ ఆ సంఖ్య 500 దాటింది. నిన్న సాయంత్రం 5 నుంచి ఉదయం 9 వరకు కొత్తగా 19 కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 502కి చేరింది.