ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై ప్రజల్లో చైతన్యం తీసుకురాడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారిణి స్వయంగా పాట పాడి.. సామాజిక దూరం ఆవశ్యకతను వివరించారు. మహిళా రక్షణ విభాగంలో అడిషనల్ ఎస్పీ, సీఐడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేజీవీ సరిత తన పాట ద్వారా ప్రజలను ఆలోచింపజేశారు.
కరోనా వైరస్‌పై పోరాటంలో పోలీసులు ముందున్నారని, యువత అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆమె పాట ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నామని.. ప్రజలు అనవసరంగా బయటకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు.