భారత గబ్బిలాల్లో కరోనా

భారత్‌లో నివసించే రెండు రకాల గబ్బిలాల్లో కరోనా వైరస్‌ కనిపించింది. వీటిలో ఈ సూక్ష్మజీవులను గుర్తించడం ఇదే మొదటిసారి. భారత వైద్య పరిశోధన మండలి , పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. భారత వైద్య పరిశోధన మండలి శాస్త్రవేత్త గంగా ఖేడ్కర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

తాము నిర్వహించిన పరిశోధనలోనూ దేశంలో కూడా రెండు రకాల గబ్బిలాల్లో కరోనా వైరస్‌ లక్షణాలు గుర్తించామని చెప్పారు. అయితే, వాటి ద్వారా మనుషులకు సోకే అవకాశం అవకాశం లేదని పేర్కొన్నారు. అయితే, వెయ్యేళ్లకోసారి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉందని తెలిపారు.