Site icon TeluguMirchi.com

హీరోకు న్యూడ్ ఫోటో పంపిన హీరోయిన్

kangana (3)హృతిక్ రోష‌న్ -కంగ‌నా ర‌నౌత్ మధ్య వివాదం కొనసాగుతోంది. గ‌తంలో వీరిద్ద‌రు ప్రేమించుకొన్న సంగతి తెలిసిందే. ‘కైట్స్’ సినిమా షూటింగ్ లో వీరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే ఏమైందో ఆ తర్వాత విడిపోయారు. ప్రేమ వికటిస్తే శత్రుత్వం కదా.! ఇప్పుడు వీరి మధ్య అదే సాగుతోంది. బద్ద శత్రువులుగా మారిపోయారు కంగనా- హృతిక్.

కంగనా అనవసరంగా తన పేరును పదే పదే ప్రస్తావించి పరువు తీస్తుందని ఏకంగా పరువునష్టం దావా వేశాడు హృతిక్. కంగనా కూడా తగ్గలేదు. ఆమె కూడా రిటర్న్ దావా వేసింది. ఇప్పుడా వ్యవహరం కోర్టులో వుంది.

అయితే ఇప్పుడీ వివాదంలో కొత్త మలుపు తిరిగింది. ఈ వివాదంలో కంగ‌నా త‌న‌కు మూడు వేల ఈమెయిల్స్ పంపి మెంట‌ల్ టార్చ‌ర్ పెట్టింద‌ని హృతిక్ ఆరోపించాడు. దీనిపై ఆధారాలు కూడా చూపించాడు. ఈ ఈమెయిల్స్ కంగనా కు సంబధించిన ఓ న్యూడ్ ఫోటో కూడా వుందట. ‘మ‌నం ఏకాంతంలో ఉన్న‌ప్పుడు నీ ముందు నేను ఇలానే ఉంటా` అనే సబ్జెక్టు తో ఈ ఫోటో పంపిందట కంగనా.

ఇప్పుడు ఇదే బాలీవుడ్ లో హాట్ టాపిక్ . కంగనా ఇలా చేసిందా అని చేవులుకోరుకుంటున్నారు బాలీవుడ్ జనాలు. అయితే ఇది ఫేక్ మెయిల్ అనే వాదనలూ వినిపిస్తున్నాయి. కంగనా పేరుతొ ఎవరో ఫేక్ ఐడీ క్రియేట్ చేసిన ఈ దారుణానికి వడి కట్టారని చెబుతున్నారు కొందరు. మొత్తమ్మీద కంగనా-హృతిక్ ఎపిసోడ్ ఇప్పుడు బాలీవుడ్ ను కుదిపేస్తోంది.

Exit mobile version