Site icon TeluguMirchi.com

జూబ్లీ గ్యారేజ్.. ఇచట ఏదైనా సాధ్యమే!, దందాకో రేటు..


ది జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌజింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్. ఇది పేరుకే బడాబాబుల సొసైటీ. తెర వెనుక అంతా స్కాముల పంచాయితీ. సొసైటీలో నాన్ అలాటీస్ పేరుతో రూల్స్‌కి విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు సొసైటీ సభ్యులకే కాదు, విషయం తెలిసిన ఎవరికైనా ఆగ్రహం తెప్పిస్తుంది. ఇది చిన్న స్కాం కాదని.. రూ.5 వేల కోట్ల స్కాం అని అంచనా. 4976 మంది ఉన్న సొసైటీలో 3035 మందికి ప్లాట్స్ అలాట్‌మెంట్ జరగగా.. మిగిలిన 1941 మంది సభ్యులు 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. వీరందరికి న్యాయ చేయాలని పాలకమండలి ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే బడాబాబుల సొసైటీలో సభ్యత్వాల స్కాంకు తెరతీస్తున్నారని తెలుస్తోంది. నాన్ అలాటీస్‌లో 800 మందికి కేవైసీ చేయించుకోలేదని వారి సభ్యత్వం రద్దుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు సొసైటీ ప్రకటన వివాదాస్పదమైంది.

800 మంది సభ్యుల సభ్యత్వాన్ని ఇంకా సొసైటీ రిజిస్ట్రార్ రద్దు చేయలేదు. కానీ టైటిల్ లేని రూ.2,500 కోట్ల ప్రాజెక్ట్‌ని చూపిస్తూ లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందమైన బ్రౌచర్ ఏర్పాటు చేసి రూ.5 లక్షలు నాన్ రీఫండబుల్ అంటూ సొసైటీ పేరు మీదుగా తీసుకుంటున్నారు. జూబ్లీ క్లబ్‌లో మెంబర్ షిప్ ఆశగా చూపించి తెర వెనుక దందా చేస్తున్నట్లు తెలిసింది. సొసైటీ యాక్ట్ ప్రకారం 10 శాతం కంటే ఎక్కువ మంది వెయిటింగ్ లిస్ట్ ఉండరాదని హైకోర్టు ఎన్నోసార్లు స్పష్టం చేసింది. దీన్ని పట్టించుకోకుండా 40 శాతం మంది ఎక్కువ ఉన్నా కూడా, సరెండర్, రద్దు లేకుండానే కొత్త సభ్యత్వాలు ఇస్తున్నారు. బదలాయింపులను యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్నారు. ఇలా తెరవెనుక సభ్యత్వాలపై జనాలు అధిక మొత్తంలో చెల్లించి ఎగబడుతున్నట్లు సమాచారం.

ఈ ప్రీలాంచ్ అమ్మకాలపై ఇప్పటికే రెరాలో ఫిర్యాదు నమోదైంది. అక్రమ బదలాయింపులపై రిజిస్ట్రార్‌కు కంప్లయింట్ కూడా చేశారు. జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీలో జరిగిన అవినీతి, అక్రమ కేటాయింపులపై రిజిస్ట్రార్ సెక్షన్ 51 దర్యాప్తు పూర్తి చేశారు. 51 దర్యాప్తు రిపోర్టులో సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. 51 దర్యాప్తు రిపోర్టు సమర్పించడంతో దాన్ని అమలు చేసేలా 29న జరిగే జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకోవద్దని మాజీ ప్రెసిడెంట్ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. లిటిగేషన్ ల్యాండ్‌లో రియల్ స్కామ్ చేస్తున్నదెవరు?.. అంతా ఆలోచించి బుక్ చేసుకుంటే బెటర్ అని.. లేదంటే మరో సాహితీ స్కామ్‌లా అవ్వొచ్చని సభ్యులు సూచిస్తున్నారు.

Exit mobile version