దేశ వ్యాప్తంగా జనాలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న జియో గిగా ఫైబర్ సేవలు రేపటి నుండి ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటి వరకు 15 లక్షల మంది జియో ఫైబర్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రతి ఒక్క వినియోగదారుడికి ఒకే ఒక్క సెటాప్ బాక్స్‌తో అనేక రకాలైన సేవలను అందించేందుకు రిలయన్స్ సంస్థ దీన్ని తీసుకు వచ్చింది. ఊహించని నెట్ స్పీడ్‌తో పాటు పలు సేవలను కూడా ఈ ఫైబర్ బాక్స్‌తో పొందవచ్చు.
కొన్ని రోజుల క్రితం ప్రకటించిన ఇది రేపటిన ఉండి ప్రారంభం కాబోతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖేష్ అంబానీ దేశ వ్యాప్తంగా అతి తక్కువ సమయంలోనే అయిదు కోట్లమంది వినియోగదారులను దక్కించుకోవాలంటూ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకోసం అప్పుడే పెద్ద ఎత్తున నగరాలకు మరియు పట్టణాలకు విస్తరించడం జరిగింది. రిలయన్స్ జియోతో ఇండియాలోని టెలికాం రంగంను మార్చేసిన ముఖేష్ ఇప్పుడు ఇంటర్నెట్ రంగంలోనే పెను మార్పులకు శ్రీకారం చుట్టాడు. రేపటి నుండి ప్రారంభం కాబోతున్న ఇది ఏ స్థాయిలో దేశంలో మార్పులకు నాంది పలుకుతుందో చూడాలి.