ఝార్ఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గర్హ్వా ప్రాంతంలో ఓ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. మరో 39 మందికి తీవ్ర గాయాలయ్యాయి.ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ నుంచి గర్హ్వాకి వస్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ప్రమాద సమయంలో దాదాపు 50మంది బస్సులో ఉన్నట్లు సమాచారం.