రెండోసారి వాయిదా పడ్డ జేఈఈ మెయిన్స్ పరీక్షలు

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అన్ని రంగాలను చుట్టుముడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యాసంస్థల కార్యకలాపాలు నిలిచిపోగా, కీలక పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 27 నుండి 30 వరకు జరగాల్సిన ఈఈ మెయిన్స్ పరీక్షలు ఇప్పటికే ఒకసారి వాయిదాపడగా తాజాగా మళ్ళీ జేఈఈ మెయిన్స్ పరీక్ష వాయిదా వేశారు. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్ జరగాల్సి ఉంది. అయితే, కోవిడ్‌ విజృంభణ వల్ల జేఈఈ మెయిన్స్‌ వాయిదా వేస్తూ కేం‍ద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ ప్రకటన చేశారు. తదుపరి పరీక్షల తేదీలు త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. ‘ఎన్టీయే అభ్యాస్ యాప్’ ద్వారా ఇంటి వద్ద నుంచే పరీక్షలకు సిద్ధం కావాలని సూచించింది.