జనకుడిగా కేంద్ర మంత్రి


ఢిల్లీలోని దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా శుక్రవారం జరిగిన లవ్ కుశ్ రామ్‌లీలా నాటకంలో సీత తండ్రి జనకుడి పాత్రలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్ష వర్ధన్‌ నటించారు. మీసం, మేకప్‌తో అసలు గుర్తుపట్టలేకుండా తయారయ్యారు. కేంద్ర మంత్రి నాటకానికి బయల్దేరి వెళ్లేముందు, తాను నాటకంలో సీత తండ్రి, మిథిలా రాజ్యానికి మహారాజు అయిన జనకుడి పాత్రలో నటిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. రెడ్‌ఫోర్ట్, చాందినీ చౌక్‌లో తన చిన్నతనంలో రామ్‌లీలా నాటకాన్ని చూసేవాడినని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్ష్‌వర్ధన్ పర్యావరణం-పరిశుభ్రత ప్రాముఖ్యత యొక్క సందేశాన్ని తెలియజేశారు. సీతా స్వయంవరానికి ఆహ్వానం పలుకుతూ జనకుడి పాత్రలో కేంద్రమంత్రి చేసిన డైలాగ్స్‌కు అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే గతంలో దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్‌ తివారీ కూడా రామ్‌లీలా కార్యక్రమంలో నటించారు.