సానియా సంసారం సాఫీగానే.. ??

sania-shoyab-malik
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సంసారంలో సమస్యలొచ్చాయ్.. అంటూ ఇటీవలే జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అందువల్లే ఇటీవలి కాలంలో.. సానియా-షోయబ్ కవడం లేదనే కథనాలొచ్చాయి. వీరి వైవాహిక జీవితం ఇబ్బందుల్లో ఉందంటూ.. భారత్‌, పాక్‌ మీడియాల్లో కూడా కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా, ఈ ప్రచారంపై సానియా భర్త షోయబ్ మాలిక్ స్పందించాడు. ఓ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో మాలిక్‌ మాట్లాడుతూ.. ఇప్పటికీ సానియా, నేను దుబాయ్‌లో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతుంటాం. కానీ, జాతీయ స్థాయి ఆటగాళ్లుగా మాకున్న ఒప్పందాల వల్ల మాకంత సమయం దొరకడం లేదు. అంత మాత్రాన మా వైవాహిక జీవితం విఫలమైందని ఎలా అంటార’ని మాలిక్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు.. పాక్‌ నటి హుమైమాతో ఎఫైర్ ప్రచారాన్ని కూడా మాలిక్ ఖండించాడు.

ఇదంతా విన్న మీడియా.. మాలిక్ ఖండించాడు గానీ.. సానియా మాట్లాడలేదుగా అంటూ కొత్త పల్లవి ఎత్తుకొంది. అసలు సానియా సంసారం సాఫీగానే జరిగేనా అంటూ కొత్త టైటిల్స్ ని పట్టుకొంది. ఈ ప్రచారానికి కూడా పులిస్టాప్ పడాలంటే.. సానియా స్పందించాల్సిందే. మరీ.. సంసారంపై సానియా ఎప్పుడు స్పందిస్తుందో ఏమో..