కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. చిన్న పెద్ద రాజు పేద అని లేదు అందరినీ పొట్టలో పెట్టుకుంటుంది. తాజాగా భారత సంతతికి చెందిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైరాలజిస్ట్ కరోనా లక్షణాలతో దక్షిణాఫ్రికాలో మరణించారు. వాక్సిన్ శాస్త్రవేత్త, హెచ్‌ఐవీపై పరిశోధకురాలు ప్రొఫెసర్ గీతా రామ్‌జీ(50) దక్షిణాఫ్రికాలో వుంటున్నారు. తాజాగా ఆమె కరోనా వైరస్ కారణంగా కన్నుమూసినట్లు అధికారులు ప్రకటించారు.
గతవారం క్రితమే గీతా రామ్‌జీ లండన్ నుంచి దక్షిణాఫ్రికా చేరుకున్నారు. అనంతరం అనారోగ్యానికి గురైన ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. కొవిడ్-19 సంబంధిత లక్షణాలకు చికిత్స పొందుతూ గీతా రామ్‌జీ మరణించారని దక్షిణాఫ్రికా వైద్య పరిశోధన మండ ప్రకటనలో వెళ్ళడించింది. ఈ వార్త కరోనాపై మరింత భయం పెంచింది.