యూపీఐ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకొనే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన భారత రైల్వే

టికెట్లు బుక్‌ చేసుకొనేందుకు యూపీఐ ద్వారా పేమెంట్లు చేసే ప్రయాణికులకు భారత రైల్వే ఇప్పటికే రాయితీని కల్పిస్తోంది. తాజాగా ఈ పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు.

డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా 2017 డిసెంబరు నుంచి టికెట్ల బుకింగ్‌కు యూపీఐ పేమెంట్లను అందుబాటులోకి తెచ్చారు. ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకొనే వారితో పాటు రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో కూడా యూపీఐ చెల్లింపులు చేసుకొనే సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ విధంగా చెల్లింపులు చేసుకున్న వారికి టికెట్‌ రుసుముపై 5 శాతం రాయితీని అందిస్తున్నారు. తాజాగా ఈ పథకాన్ని 2022 జూన్‌ వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.