Site icon TeluguMirchi.com

3000 కోట్ల విలువైన డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్న ఇండియన్ నేవీ

భారత నావికాదళ షిప్ సువర్ణ, అరేబియా సముద్రంలో నిఘా పెట్రోలింగ్‌లో ఉన్న నేపథ్యంలో అనుమానాస్పద కదలికలతో ఒక ఫిషింగ్ నౌక కనిపించింది. దీంతో ఆ నౌకతో పాటు నౌకకు సంబంధించిన సిబ్బందిని ఈ బృందం తనిఖీ చేసింది. ఈ క్రమంలో 300 కిలోల కంటే ఎక్కువ మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి.

తదుపరి దర్యాప్తు కోసం పడవతో పాటు అందులోని సిబ్బందిని సమీపంలోని ఇండియన్ పోర్ట్ ఆఫ్ కొచ్చి, కేరళకు తీసుకెళ్లారు. పట్టుబడ్డ సరుకు విలువ అంతర్జాతీయ మార్కెట్లో  సుమారు రూ. 3000 కోట్లు ఉంటుంది. ఇది పరిమాణం, వ్యయం పరంగానే కాకుండా మక్రాన్ తీరంలో భారతీయ, మాల్దీవియన్ మరియు శ్రీలంక గమ్యస్థానాలకు చేరే అక్రమ మాదకద్రవ్యాల  రవాణా మార్గాల పరంగానూ ఇది భారీ స్వాధీనం. మాదకద్రవ్యాలు ఆరోగ్యపరంగానే కాకుండా ఉగ్రవాదం, రాడికలైజేషన్ మరియు నేర కార్యకలాపాలకు దారితీస్తోంది.

Exit mobile version