నైరుతి రుతుపవనాలు ఇప్పటికే అండమాన్, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించినట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్ప పీడనం ఈ రాత్రికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర వాయువ్య దిశగా కదిలి రేపటికి తుపానుగా మారే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఆ తర్వాత 24 గంటల్లో తీవ్ర తుపానుగా బలపడుతుందని తెలిపింది. అనంతరం ఉత్తర వాయువ్యంగా కదిలి పెను తుపానుగా మారే సూచనలున్నట్లు స్పష్టం చేసింది. ఈ నెల 26న ఉదయం ఒడిశా- బెంగాల్ తీరాన్ని తాకే అవకాశం ఉందని.. ఆరోజు సాయంత్రం ఒడిశా- బెంగాల్ మధ్య తీరం దాటవచ్చని వాతావరణశాఖ పేర్కొంది.