Site icon TeluguMirchi.com

భారత్ ను వెస్టిండీస్ ఆపగలదా ?


వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ను 1-0 తో కైవసం చేసుకున్న భారత్.. గురువారం మూడు వన్డేల సిరీస్ కు సిద్ధమైంది. ఆసియాకప్, ప్రపంచకప్ కు ముందు ఇదే చివరి వన్డే సిరీస్ కావడంతో సన్నాహకంగా ఉపయోగించుకోవాలని టీం ఇండియా భావిస్తోంది. టెస్టుల్లో సత్తాచాటలేకపోయిన కరేబియన్లను వన్డేల్లో తక్కువ అంచనా వేయలేమని విశ్లేషకులు భావిస్తుండగా.. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ మాత్రం ఈ సిరీస్ ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. బ్యాటింగ్ లో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ తో పాటు శుభమన్ గిల్ లేదా రుతురాజ్ గైక్వాడ్ లలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. ఇక వన్ డౌన్ లో పరుగుల మిషన్ విరాట్ కోహ్లి ఉండనే ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, ఇసాంత్ కిషన్ లలో ఇద్దరికే జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది. వికెట్ కీపర్ గా ఉన్న కిషన్ వైపే మేనేజ్ మెంట్ మొగ్గు చూపే అవకాశం ఉంది.

బౌలింగ్ విషయానికి వస్తే వైస్ కెప్టెన్ హార్థిక పాండ్యా, ముకేష్ కుమార్, సిరాజ్ ఉండగా.. స్పిన్ లో కుల్దీప్ యాదవ్, చహల్ ద్వయంతో బలంగా ఉంది. రవీంద్రజడేజా, అక్షర్ పటేల్, పాండ్యాలు ఆల్ రౌండర్ పాత్రను పోషించనున్నారు. ఇప్పటికే కరేబియన్లు ప్రపంచ కప్ కు క్వాలిఫై కాకపోవడంతో భారత్ లో జరిగే మోగా టోర్నీకి దూరమయ్యారు. ఈ నెల 27, 28, ఆగష్టు 1న మూడు వన్డేలు జరగనుండగా ఆ తర్వాత 5 T20 సిరీస్ లో భారత్ ను కరేబియన్లు ఢీ కొట్టనున్నారు. ఈ సిరీస్ భారత్ కు ఎంతో ముఖ్యం. ఇకపోతే ప్రపంచకప్ కు సన్నాహకంగా భావించే ఈ మ్యాచ్ ల్లో భారత్ ప్రయోగాలు చేయనుంది.

Exit mobile version