టీ20 వరల్డ్ కప్: మన గెలుపు గుర్రాళ్ళు


2024 టీ20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టు ఖరారైయింది. అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ భారత జట్టును ఫైనల్ చేసింది. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య తో పాటు యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, సంజూ శాంసన్‌, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రా జట్టులో ఎంపికయ్యారు.

జట్టులోకి రిషబ్ పంత్ రావడం విశేషం. పంత్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడి 14 నెలలపాటు ఆటకు దూరమయ్యాడు. అయితే ఈ ఐపీఎల్ సీజన్‌ అతనికి బాగా కలిసోచ్చింది. ఐపీఎల్ లో దూకుడుగా ఆడుతున్న పంత్ ఇప్పుడు టీమ్‌ఇండియా తరఫున కూడా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. లెగ్ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ జట్టులోకి వచ్చాడు. ఇక ఐపీఎల్ చక్కని ఆట తీరు కనబరుస్తున్న తిలక్ వర్మ, మయాంక, అభిషేక్ శర్మ లాంటి ఆటగాళ్ళ జట్టులోకి ఉంటారని భావించినప్పటికీ జట్టులో స్థానం దొరకలేదు. సీనియర్లవైపే మొగ్గు చూపారు సెలక్టర్లు.

ఈ సారి టీ20 ప్రపంచకప్‌నకు యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈసారి సిరీస్‌లో మొత్తం 20 జట్లు తలపడుతున్నాయి. భారత్‌ తన తొలి మ్యాచ్‌ను జూన్‌ 5న ఐర్లాండ్‌తో ఆడుతుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో కెనడా ఢీ కొట్టనుంది. ‘గ్రూప్‌ ఏ’లో ఉన్న భారత్‌-పాక్‌ జట్లు న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 9న తలపడనున్నాయి. సిరిస్ లో మొత్తం 55 మ్యాచులు జరుగుతాయి. జూన్ 29న ఫైనల్ వుంటుంది.