Site icon TeluguMirchi.com

భారత్ ఘన విజయం

Tri-seriesముక్కోణపు టోర్నిలో వెంస్టిండీస్ పై భారత్ ఘనవిజయంతో.. టోర్నిలో మొదటి విజయాన్ని అందుకొంది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో వెస్టిండీస్ పై భారత జట్టు 102 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచి పోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్దతిన విండీస్ లక్ష్యాన్ని 39 ఓవర్లలో 274 పరుగుల లక్ష్యాన్ని నిర్ణయించారు. భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్ 171 పరుగులకే చేతులెత్తేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్ మూడేసి వికెట్లు, ఇషాంత్ శర్మ, జడేజాలు రెండేసి వికెట్లు పడగొట్టారు. వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ లలో  చార్లెస్ (45), రోచ్ (34), నరైన్(24)లు మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ నమోదు చేశారు.

అంతకుముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన భారత్ యువ బ్యాట్స్ మెన్ కోహ్లీ విజృంభించడంతో.. 312 పరుగులు లక్ష్యాన్ని వెస్ట్ఘిండీస్ ముందు వుంచగలిగింది. భారత బ్యాట్స్ మెన్ లలో  విరాట్ కోహ్లీ (102), ధావన్ 69,  రోహిత్ శర్మ 46 పరుగులు చేశారు.  భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ విరాట్ కోహ్లికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

Exit mobile version