రెండు వారాలపాటు భారత్‌తో ఉన్న సరిహద్దులను మూసివేస్తున్నట్లు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి అబ్దుల్ ఒమెన్ ప్రకటించారు. సరిహద్దుల వెంట జన సంచారాన్ని, వాహన ప్రయాణాలను కొవిడ్ కారణంగా నిషేధిస్తున్నట్లు ఒమెన్ వెల్లడించారు. అయితే నిత్యావసర వస్తువులను రవాణా చేసే వాహనాలకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో ఇరు దేశాల మధ్య విమాన ప్రయాణాలను ఏప్రిల్ 14 నుంచే అధికారులు రద్దు చేశారు.