Site icon TeluguMirchi.com

ఎయిర్‌పోర్ట్‌లో పేలిన ప‌వ‌ర్‌బ్యాంక్‌

మొబైల్ ఛార్జింగ్ కోసం వాడే ప‌వ‌ర్ బ్యాంక్ పేలిన ఘ‌ట‌న‌లో ఢిల్లీ పోలీసులు 55 ఏళ్ల మ‌హిళ‌ను అరెస్టు చేశారు. దిల్లీలోని డిఫెన్స్‌ కాలనీకి చెందిన మాళవిక తివారీ నిన్న ఉదయం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. ఆమె స్పైస్‌జెట్‌ విమానంలో ఉదయం ధర్మశాలకు వెళ్లాల్సి ఉంది. యిర్‌పోర్ట్‌లో త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో మ‌హిళ బ్యాగ్‌లో పోలీసులు ప‌వ‌ర్ బ్యాంక్‌ను గుర్తించారు. చెకింగ్‌ సమయంలో ఏదో అనుమానాస్పదంగా కనిపించడంతో బయటకు తీశారు.

నిబంధనల ప్రకారం చెక్‌-ఇన్‌ లగేజీలో పవర్‌బ్యాంక్‌ తీసుకెళ్లకూడదని, దాన్ని చెక్‌-ఇన్‌ లగేజీలో కాకుండా వేరే బ్యాగులో పెట్టుకొమ్మని చెప్పామని తెలిపారు. దీంతో అక్క‌డ వారి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. ఆ త‌ర్వాత ఆ మ‌హిళ‌.. ఆవేశంతో బ్యాగ్ నుంచి ప‌వ‌ర్ బ్యాంక్‌ను తీసి నేల‌కేసి కొట్టింది. బ‌లంగా నేల‌కు కొట్ట‌డంతో.. అది పేలింది. విమానాశ్రయంలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొందని, ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారని చెప్పారు. ఆ మ‌హిళ‌ను అరెస్టు చేసిన పోలీసులు ఆమెను త‌ర్వాత బెయిల్‌పై రిలీజ్ చేశారు. ఆ మ‌హిళ ఓ సినీ న‌టి అని ఎయిర్‌పోర్టు వ‌ర్గాలు తెలిపాయి.

Exit mobile version