టెస్ట్ క్రికెట్ లో టీమిండియా వరల్డ్ రికార్డ్

టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా ఓ వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. వేగంగా 50 పరుగులు చేసిన టీంగా అవతరించింది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఈ రికార్డ్ ని నమోదు చేసింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, జైస్వాల్ కలసి 18 బంతుల్లో 51 పరుగులు బాదేశారు. అంతకుముందు ఈ రికార్డ్ ఇంగ్లాడ్ జట్టు పేరిట వుండేది. వెస్ట్ ఇండిస్ తో ఆడిన ఓ మ్యాచ్ లో 26 బంతుల్లో 50 పరుగులు చేశారు. ఇంగ్లీష్ ఓపెనర్స్ బెన్ డకెట్, ఆలీ పోప్. ఇప్పుడా రికార్డ్ ఇండియా బ్రేక్ చేసింది.

రెండో టెస్ట్ లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా మొదటి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌటైంది. మొమినల్ హక్ (107) సెంచరీ కొట్టాడు. భారత పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా 3, సిరాజ్ 2, ఆకాశ్‌ దీప్‌ 2 వికెట్లు తీయగా.. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ 2, జడేజా ఓ వికెట్ పడగొట్టారు.

మొదటిరోజు35 ఓవర్లు ఆట సాగగా.. గత రెండు రోజులూ ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దైంది. ఇది నాలుగో రోజు. బంగ్లా టార్గెట్ వీలైనంత తొందరగా ఫినిష్ చేసి, లీడ్ తీసుకొని మ్యాచ్ ఫలితం వచ్చేలా ఇండియా ఆటగాళ్ళు దూకుడుగా ఆడుతున్నారు. వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్ టైటిల్ కి ఈ మ్యాచు కీలకం కావడంతో ఎట్టిపరిస్థితిలో గెలవాలనే వ్యూహంతో టీ20 మ్యాచ్ కంటే వేగంగా ఆడుతోంది టీమిండియా.