సాహో.. టీమ్‌ఇండియా

భారత క్రికెట్‌ జట్టు చరిత్ర సృష్టించింది . తొలిసారి దక్షిణాఫ్రికా గడ్డపై ఒకటికి రెండు ఫార్మాట్లలో సిరీస్‌ చేజిక్కించుకుని సగర్వంగా పర్యటనకు ముగింపు పలికింది భారత క్రికెట్‌ జట్టు. హోరాహోరీగా సాగిన టెస్టు సిరీస్‌లో 1-2తో ఓడిన టీమ్‌ఇండియా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌ల్లో ఆతిథ్య జట్టుకు షాక్ ఇచ్చింది. వన్డే సిరీస్‌ 5-1తో సొంతం చేసుకున్న భారత్‌.. టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. నివారం నిర్ణయాత్మక మూడో టీ20లో టీమ్‌ఇండియా 7 పరుగుల తేడాతో నెగ్గింది.

ఉత్కంఠభరితంగా సాగిన చివరి టీ20లో భారత్‌ నెగ్గి, సిరీస్‌ చేజిక్కించుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. దీంతో 7 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్ లో కోహ్లి వెన్ను నొప్పితో ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో రోహిత్‌ పగ్గాలు చేపట్టాడు. భువనేశ్వర్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా ఎంపికయ్యాడు.