భారత్‌ నిర్ణయం భేష్


భారత్‌లో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మే 3 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వాగతించింది. కొవిడ్-19ను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌ తీసుకుంటున్న చర్యల్ని ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రాంతీయ డైరెక్టర్‌ పూనం ఖేత్రపాల్‌ ప్రశంసించారు.

కాగా, మే 3వ తేది వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 20వరకు లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయనున్నట్టు తెలిపారు. ఏప్రిల్‌ 20 వరకు దేశంలో పరిస్థితులను నిశితంగా పరిశీలన చేస్తామని చెప్పారు. కరోనా హాట్‌స్పాట్‌లు కానీ ప్రాంతాలతో షరతులతో కూడిన సడలింపు ఉంటుందన్నారు.