Site icon TeluguMirchi.com

IND vs ZIM : పసికూన చేతిలో ఓడిన భారత్..


ఇటీవ‌ల టీ20వర‌ల్డ్ క‌ప్ గెలిచి విశ్వ విజేత‌లుగా నిలిచిన టీమ్ ఇండియాకు జింబాబ్వే షాక్ ఇచ్చింది. ఈరోజు జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌లో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో భారత్ ఓటమి చవిచూసింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 102 పరుగులకు అలౌట్ అయింది. దీంతో 13 పరుగుల తేడాతో పసికూన జింబాబ్వే విజయం సాధించింది.

Also Read : మస్ట్ వాచ్ థ్రిల్లర్ ‘ఆరంభం’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్(4/13), వాషింగ్టన్ సుందర్(2/11) జింబాబ్వేని త‌క్కువ ప‌రుగుల‌కి క‌ట్ట‌డి చేశారు. అనంతరం 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. శుబ్‌మన్ గిల్(29 బంతుల్లో 5 ఫోర్లతో 31), వాషింగ్టన్ సుందర్(34 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 27 ), ఆవేశ్ ఖాన్(12 బంతుల్లో 3 ఫోర్లతో 16) త‌ప్ప మిగ‌తా బ్యాట్స్‌మెన్స్ అంద‌రు కూడా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. చివ‌రి ఓవ‌ర్‌ వ‌ర‌కూ నిల‌బ‌డిన సుంద‌ర్ ఓట‌మిని మాత్రం త‌ప్పించ‌లేక‌పోయాడు. ఈ విజ‌యంతో ఆతిథ్య జ‌ట్టు ఐదు మ్యాచ్‌ల‌ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Also Read : టాలీవుడ్ లో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న మహిళా నిర్మాత

Exit mobile version