Site icon
TeluguMirchi.com

విశాఖలో భారత్ కు ఘోర ఓటమి

వన్డే సిరిస్ లో భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆసిస్ పేస్‌ ధాటికి సగం ఓవర్లు ఆడేందుకూ టీమ్‌ఇండియా కష్టపడిన పిచ్‌పైనే ఆసీస్‌ విశ్వరూపం చూపించింది. విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డే లో రోహిత్‌ సేన ఇచ్చిన 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 11 ఓవర్లలోనే ఛేదించింది. సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగుతూ వికెట్‌ పడకుండా ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌ (51*), మార్ష్‌ (66*) పని పూర్తి చేశారు. ఈ విజయంతో ఆసీస్‌ 1-1తో సిరీస్‌ను సమం చేసి టైటిల్‌ రేసులో నిలిచింది. ఇక చెన్నై వేదికగా జరిగే చివరిదైన మూడో మ్యాచ్‌ సిరీస్‌ విజేతను తేల్చనుంది.

Exit mobile version