Site icon TeluguMirchi.com

బెంగ‌ళూరులో ఆదాయ‌పు ప‌న్ను శాఖ సోదాలు… భారీగా బంగారం, డబ్బు స్వాధీనం !

నీటిపారుదల, హైవే ప్రాజెక్టుల నిర్మాణ‌ ప‌నుల‌లో నిమగ్నమైన బెంగుళూరుకు చెందిన ముగ్గురు ప్రధాన కాంట్రాక్టర్ల విషయ‌మై ఆదాయపు పన్ను శాఖ సోదాలు, జ‌ప్తు కార్యకలాపాలను నిర్వహించింది. 07.10.2021న ప్రారంభమైన ఈ ఆదాయ‌పు ప‌న్ను శాఖ సోదాలు 4 రాష్ట్రాల్లోని 47 ప్రాంగణాల్లో జరిగాయి. ఈ మూడు గ్రూపుల వారు బోగస్ కొనుగోళ్లను లెక్క‌కు చూప‌డం, వారి ఆదాయాన్ని అణచివేయడం వంటి కార్య‌క్ర‌మాల‌లో ఈ గ్రూపు సంస్థ‌లు పాల్గొన్నట్లు కనుగొనబడింది; కార్మిక వ్యయాల పెంచి చూప‌డం; బోగస్ సబ్-కాంట్రాక్ట్ ఖర్చుల బుకింగ్ మొదలైన అక్ర‌మాల‌కు సంబంధించిన ఆధారాలు ల‌భించాయి. నిర్మాణ కార్య‌క్ర‌మాల‌తో ఎలాంటి సంబంధ‌ము లేని,  దాదాపు 40 మంది వ్యక్తుల పేరిట ఒక గ్రూపు బోగస్ సబ్-కాంట్రాక్ట్ ఖర్చులను బుక్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆదాయ‌పు ప‌న్ను శాఖ విచారణలో ఆయా వ్యక్తులు స‌ద‌రు అవకతవకలను అంగీకరించారు.

ఒక గ్రూపు వారు కార్మిక వ్యయాలను దాదాపు రూ. 382 కోట్ల మేర పెంచి చూపిన‌ట్టుగా గుర్తించ‌డమైంది.  మ‌రోక గ్రూపు  వ‌స్త‌వంగా ఏర్పాటు చేయ‌ని పేపర్ కంపెనీల నుండి దాదాపు రూ.105 కోట్ల మేర‌ వసతి నమోదుల‌ను చేప‌ట్టిన‌ట్టుగా తేలింది. ఈ విష‌యాన్ని స‌ద‌రు గ్రూపు ఇప్ప‌టికే అంగీకరించింది. భౌతిక పత్రాలు, డిజిటల్ ఆధారాలు మొదలైన వాటి రూపంలో వివిధ నేరారోపణ ఆధారాలు కనుగొనబడ్డాయి. వీటిని ఆదాయ‌పు ప‌న్ను శాఖ వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల‌లో రూ.4.69 కోట్ల మేర లెక్క‌ల్లో చూప‌ని న‌గ‌దు, రూ.8.67 కోట్ల మేర జ్యువెల్ల‌రీ, బంగారం, దాదాపు రూ.29.83 ల‌క్ష‌ల విలువైన వెండి వ‌స్తువుల‌ను గుర్తించి జ‌ప్తు చేయ‌డం జ‌రిగింది. ఈ మూడు గ్రూపుల్లో సోదాలు, జ‌ప్తు కార్య‌క్ర‌మాల‌లో లెక్క‌కు చూప‌ని దాదాపు రూ.రూ. 750 కోట్ల సొమ్మును గుర్తించారు.  ఇందులో మొత్తం రూ .487 కోట్ల మొత్తాన్ని సంబంధిత గ్రూపు సంస్థలు తమ అప్రకటిత ఆదాయంగా అంగీకరించాయి. ఈ విష‌యంలో త‌దుప‌రి విచార‌ణ కొన‌సాగుతోంది.

Exit mobile version