Site icon TeluguMirchi.com

గాడిన పడుతున్న భారత్ ఆర్ధిక వ్యవస్థ

భారత్‌ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటన నడుస్తోందని IMF ప్రతినిధి గ్యారీ రైస్‌ పేర్కొన్నారు. ప్రపంచబ్యాంక్‌తో కలిసి వచ్చే నెల్లో ‘స్ప్రింగ్‌’ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. అలాగే ఏప్రిల్‌ 6న ఐఎంఎఫ్ తన వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ను కూడా విడుదల చేయనుంది.

2020 నాల్గవ త్రైమాసికంలో (అక్టోబర్‌-డిసెంబర్‌) క్షీణతలోంచి బయటపడింది. మూలధనం, పెట్టుబడి వ్యయాలు పెరుగుతున్నాయి అని విలేకరుల సమావేశంలో గ్యారీ పేర్కొన్నారు. దీనికితోడు 2021 మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్, రవాణాసహా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పలు ఇండికేటర్స్‌ సానుకూలంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే కరోనా కొత్త స్ట్రెయిన్స్, స్థానిక లాక్‌డౌన్‌లు రికవరీబాటలో కొంత ఇబ్బందికరమైన పరిణామాలని కూడా ఆయన అన్నారు.

Exit mobile version