2021లో పురోగమించనున్న భారత్‌ ఆర్థిక వ్యవస్థ

భారత్‌ ఆర్థిక వ్యవస్థ 2021లో భారీగా 12.5 శాతం పురోగమిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనావేసింది. ఇదే జరిగితే వేగంగా వృద్ధి చెందుతున్న దేశం హోదాను భారత్‌ తిరిగి సాధించగలుగుతుంది. కాగా 2022లో భారత్‌ వృద్ధి 6.9 శాతంగా ఉంటుందని పేర్కొంది.

కోవిడ్‌–19 మహమ్మారి సవాళ్లలోనూ 2020లో వృద్ధి సాధించిన పెద్ద ఎకానమీగా చైనా నిలబడిన సంగతి తెలిసిందే. 2020లో భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఎనిమిది శాతం క్షీణించగా, చైనా 2.3 శాతం వృద్ధి సాధించింది. 2021లో ఆ దేశం 8.6%, 2022లో 5.6 శాతం పురోగతి సాధిస్తుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ప్రపంచబ్యాంక్‌తో కలిసి త్వరలో వార్షిక ‘స్పింగ్‌’ సమావేశాలు నిర్వహించనున్న బహుళజాతి బ్యాకింగ్‌ దిగ్గజం– ఐఎంఎఫ్‌ తాజాగా వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ను ఆవిష్కరించింది.