ఇంట్లో కట్టుకున్న భార్య ఉండగానే కొంతమంది మగవారు కట్టుకున్న భార్య ను కాదని చెప్పి పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్య కు అన్యాయం చేస్తున్నారు. తాజాగా పాల్వంచలోను ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. పోలీస్ శాఖా లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్..కట్టుకున్న భార్య ను కాదని మరో యువతితో రాసలీలలు సాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య..రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని బడితెపూజ చేసింది. నడిరోడ్డుపై చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది. తనను మోసం చేసి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.