ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత యువ జట్టుకు గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు వెస్టిండీస్‌లో జరుగనున్న ఈ టోర్నీ కోసం భారత అండర్-19 జట్టును బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. యశ్ ధూల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. కాగా 2000, 2008, 2012, 2018లలో భారత యువ జట్టు అండర్-19 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచింది. 2016, 2020లలో రన్నరప్ ట్రోఫీలు అందుకుంది.