Site icon TeluguMirchi.com

నంబ‌ర్‌వ‌న్‌ ఆల్‌రౌండర్ గా చోటు దక్కించుకున్న ర‌వీంద్ర జ‌డేజా

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత ఆల్‌రౌండర్ ర‌వీంద్ర జ‌డేజా ఆల్‌రౌండ‌ర్ల లిస్ట్‌లో నంబ‌ర్‌వ‌న్‌గా నిలిచాడు. 386 పాయింట్ల‌తో జ‌డేజా అగ్రస్థానం దక్కించుకున్నాడు. 2017 తర్వాత జడేజా నెంబర్ వన్ స్థానంలో ఉండటం ఇదే తొలిసారి. ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉన్న వెస్ట్ ఇండీస్ స్కిప్పర్ జాసన్ హోల్డర్ 384 పాయింట్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ అల్ రౌండర్ బెన్ స్టోక్స్ 377 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ 353 పాయింట్లతో నాల్గవ స్థానంలో కొనసాగుతున్నాడు.

బౌలింగ్ లిస్ట్ లో రవిచంద్రన్ అశ్విన్ 850 పాయింట్లతో సెకండ్ ప్లేస్ దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా నుండి పాట్ కమ్మిన్స్ 908 పాయింట్లతో మొదటి స్థానం కైవసం చేసుకోగా, న్యూజిలాండ్ నుండి టిమ్ సౌథీ 830 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు .

బాటింగ్ లిస్ట్ ఎటువంటి మార్పు లేదు. ఆస్ట్రేలియా నుండి స్టీవ్ స్మిత్ 891 పాయింట్లతో మొదటి స్థానంలో యదావిధిగా కొనసాగుతుండగా, రెండవ స్థానంలో 886 పాయింట్లతో న్యూజిలాండ్ నుండి కేన్ విలియంసన్, మూడో స్థానంలో 878 పాయింట్లతో ఆస్ట్రేలియా నుండి మార్నుస్ లాబుశ్చాగ్నే, నాల్గవ స్థానంలో 814 పాయింట్లతో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొనసాగుతున్నారు.

Exit mobile version